unidentified drones over Pa

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య డ్రోన్ ఎగరినట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయానికి తెలపడంతో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారమందించారు.

డ్రోన్ సంచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను రేపుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో విద్యుత్ విరామం కలగడంతో అంతరాయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ రావు హల్‌చల్ చేసాడు. ఇలా వరుసగా భద్రత వైఫల్యాలు వెలుగులోకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఆందోళన ఎక్కువైపోతోంది.

Related Posts
ఇరాన్ తో సంబంధాలపై ట్రంప్ కొత్త దృష్టి
musk iravani

ప్రముఖ బిలియనియర్ ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. మస్క్ ఇటీవల ఇరాన్ యునైటెడ్ Read more

నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే ఇలా చెయ్యండి – డీజీపీ గుప్తా
DGP gupta

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ గుప్తా సూచించారు. నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు ఉందని అనిపిస్తే వెంటనే 100 Read more

స్కూల్లో అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారులు సజీవదహనం
fire in schook

నైజీరియాలో ఓ స్కూల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జంఫారా రాష్ట్రంలోని కైరా నమోదాలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో Read more

Tenth board exams 2025:టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్! ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులో

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు Read more