ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య డ్రోన్ ఎగరినట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయానికి తెలపడంతో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారమందించారు.
డ్రోన్ సంచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను రేపుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో విద్యుత్ విరామం కలగడంతో అంతరాయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ రావు హల్‌చల్ చేసాడు. ఇలా వరుసగా భద్రత వైఫల్యాలు వెలుగులోకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఆందోళన ఎక్కువైపోతోంది.