అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై నిరుద్యోగ యువ‌త భ‌గ్గుమ‌న్నారు. నిరుద్యోగుల‌ను అవ‌మానించేలా సీఎం మాట్లాడారని నిరుద్యోగులు రోడ్డెక్కారు. శనివారం రాత్రి హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లో భారీ ధ‌ర్నాకు దిగారు. రోడ్డును దిగ్భందం చేశారు. ప్ర‌భుత్వం దిగి వ‌చ్చే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతోంద‌ని నిరుద్యోగులు తేల్చిచెప్పారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ – 2, గ్రూప్ – 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

త‌మ వెనుకాల ఏ రాజ‌కీయ పార్టీ లేద‌ని , కావాల‌ని కొంద‌రు సీఎం రేవంత్ రెడ్డికి త‌ప్పుడు స‌మాచారం అందిస్తున్నార‌ని , గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాలి.. దాంతో పాటు గ్రూప్-2, 3 పోస్టుల‌ను పెంచాలి. డీఎస్సీని మూడు నెల‌ల పాటు వాయిదా వేసి 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని వారంతా తెలిపారు.