ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మోసాల్లోనే ఇది నెక్స్ట్ లెవల్ మోసం అనుకోవచ్చు. ఎందుకంటే ఓనర్‌కు తెలియకుండా ఓ దళారి ఇంటిపై రూ. కోటి బ్యాంకు లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈఎంఐలు కట్టకుండా ఎగ్గొట్టాడు. దీంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు రాగాఇంటి ఓనర్ ఖంగుతున్నాడు.

దీంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు రాగాఇంటి ఓనర్ ఖంగుతున్నాడు. కుటుంబంతో సహా ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ ప్రకాష్ నగర్‌లో చోటు చేసుకుంది.ఆ తర్వాతే దినకర్ అసలైన మోసానికి తెరతీశాడు. రజినీ పేరుతో ఇల్లు ఉన్నట్లు ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించాడు. భూషణ్‌కు తెలియకుండానే అతడి ఇంటిని హైదర్‌గూడ మహారాష్ట్ర బ్యాంక్‌లో తాకట్టు పెట్టాడు. అలా తాకట్టు పెట్టి రూ.కోటి వరకు లోన్ తీసుకున్నాడు. మెుదటి రెండు నెలలు ఈఎంలు కట్టిన దినకర్.. ఆ తర్వాత డీఫాల్టర్‌గా మారాడు. కిస్తీలు కట్టడం మానేశాడు.
దీంతో రంగంలోకి దిగిన బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటికి స్పందించకపోవటంతో ఇంటిని సీజ్ చేసేందుకు సిద్ధమైయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ప్రకాశ్ నగర్‌లోని భూషణ్ ఇంటికి చేరుకున్నారు. బ్యాంకు లోన్ తీర్చనందున ఇంటిని జప్తు చేస్తున్నట్లు చెప్పారు.దీంతో భూషణ్, ఇతర కుటుంబ సభ్యులు కుంగుతున్నరూ. తాము లోన్ తీసుకోకుండా ఇంటిని ఎలా జప్తు చేస్తారని ప్రశ్నించారు. దినకర్ అనే వ్యక్తి భార్య పేరుతో ఇల్లు ఉందని అతడే లోన్ తీసుకున్నట్లు చెప్పారు. గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుల తరపు అడ్వకేట్‌తో కలిసి బ్యాంకుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు. దినకర్ చేసిన మోసం వల్లే ఇదంతా జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసుల నమోదు చేసుకొని దినకర్ కోసం గాలిస్తున్నారు.