Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma

సనాతన ధర్మం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma

చెన్నై: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దానికి ఉదయనిధి స్పందిస్తూ… ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానం ఇచ్చారు.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దీనిపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు మండిపడ్డారు. నిన్న తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని కూడా టార్గెట్ చేశారు. నిన్న ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని ఏపీ డీప్యూటీ సీఎం అన్నారు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారన్నారు. తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావొచ్చు… పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.

Related Posts
శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి కౌంట్‌డౌన్
sriharikota

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్‌తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 Read more

నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు..!
CM Chandrababu visit to Annamayya district today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ Read more

అంగన్ వాడీ లకు చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం
telangana anganwadi

తెలంగాణ రాష్ట్రం అంగన్ వాడీ (Anganwadis) టీచర్లకు, హెల్పర్లకు గిప్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నందున, ప్రతి టీచర్‌కు మరియు హెల్పర్‌కు Read more

‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం..గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా’ – కేటీఆర్
ktr revanth

రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . 'ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో Read more