ముస్లిం ప్రజల అతిపెద్ద పండగు అయిన రంజాన్ సందర్బంగా యూఏఈ అధ్యక్షుడు పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా 2813 మందికి క్షమాభిక్షలు మంజూరు చేయగా.. అందులో 1295 మందిని విడుదల చేయబోతున్నారు. అలాగే 1518 మందికి శిక్షను తగ్గించనున్నారు. అయితే విడుదల అయిన ఖైదీల్లో 500 మందికి పైగా భారతీయులు ఉండగా.. వారితో పాటు వారి కుటుంబాలు సహా తెగ సంబుర పడిపోతున్నాయి.
పెద్ద ఎత్తున క్షమాభిక్షలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించారు. అయితే నెల రోజులు కూడా గడవక ముందే మరోసారి పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా వారెంతో పవిత్ర మాసంగా భావించే ఈనెల.. రంజాన్ పండుగకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాతే అధ్యక్షుడు 1295 మందిని విడుదల చేయాలని చెప్పారు. అయితే ఇందులో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారు. దీంతో విడుదల అయిన వాళ్లు, క్షమాభిక్షలు పొందిన వాళ్లు సహా వారి కుటుంబ సభ్యులంతా తెగ సంబుర పడిపోతున్నారు.
UAE: రంజాన్ సందర్భంగా యూఏఈ క్షమాభిక్షలు.. 500 మంది భారతీయ ఖైదీలకు ఊరట
Advertisements
Advertisements