ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్‌కి పాకిస్తాన్ దుబాయ్ వేదికగా అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ఈ టోర్నమెంట్‌లో షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కంటే ముందే ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ టోర్నీకి దూరంగా ఉండవచ్చని సమాచారం. ఆయన కాలి గాయంతో బాధపడుతున్నందున అతను ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనకపోవడం ఖాయంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధృవీకరించారు.

అలాగే స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనట్లేదని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.జోష్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నాడు అందువల్ల అతను కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమైతే ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మార్పులు ఉండవచ్చు. టోర్నీకి ముందు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
పరిస్థితి విషయాన్ని బట్టి, పాట్ కమ్మిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద దెబ్బ గా మారవచ్చు.ఆస్ట్రేలియా జట్టు గతంలో అన్ని టోర్నమెంట్‌లలో కమ్మిన్స్ నాయకత్వంలో విజయాలు సాధించింది. ఆయన నేతృత్వంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వన్డే ప్రపంచ కప్‌తో పాటు ఇటీవల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో కూడా విజయం సాధించింది. కమ్మిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి కమ్మిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.