హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీ తరహాలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో ‘డ్యూ’ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ₹100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Advertisements

హైదరాబాద్ ఐటీ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడుల కోసం తెలంగాణను ప్రాధాన్యతతో ఎంచుకుంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కొత్త ఐటీ పార్కుల కోసం అనువైన ప్రదేశాలు మరియు అవసరమైన భూమిని నిర్ణయించేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని చేపడుతున్నాము అని నగర శివార్లలో అనుకూల ప్రాంతాలను గుర్తించడం ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఐటీ పార్కుల్లో అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని అలాగే నగరంలోని ఏ ప్రాంతం నుంచి అయినా సులభంగా చేరుకునే విధంగా వాటిని రూపకల్పన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఐటీ పార్కుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ భూకేటాయింపుల కోసం స్పష్టమైన విధానం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం భూకేటాయింపులకూ నిర్దిష్ట విధానం లేదు అని ఇది పారిశ్రామికవేత్తలకు సవాళ్లను ఎదుర్కొనిపెడుతోంది అని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి మొత్తం, కంపెనీలు సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం పెట్టుబడుల లభ్యాన్ని పెంచి, పారిశ్రామిక రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంది. తెలంగాణను పెట్టుబడుల కోసం ఆకర్షించేలా ఈ నిర్ణయాలు సహాయపడతాయి.

Related Posts
పేలుడు ఘటనలో హైదరాబాద్ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరుల మృతి
పేలుడు ఘటనలో హైదరాబాద్ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరుల మృతి

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనలో హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో Read more

TGPSC: గ్రూప్-1 ర్యాంకింగ్స్ విడుదల.. మహిళలదే పై చేయి
TGPSC: గ్రూప్-1 ర్యాంకింగ్స్ విడుదల.. మహిళలదే పై చేయి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల ఫలితాల్లో మహిళలు తమ సత్తా చాటారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల జనరల్ ర్యాంకింగ్ Read more

TPCC: టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?
TPCC

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC)లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత, Read more

గాజా-ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు
గాజా ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు

గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు కారణంగా శనివారం 70 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఈ కాల్పులు, 15 నెలల యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులు విరమణ Read more

×