వైసీపీ కి మరో ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు ఎలాగైతే నేతలు వరుస పెట్టి రాజీనామా చేసారో..ఇప్పుడు కూడా వరుసపెట్టి జగన్ కు షాక్ ఇస్తూ టిడిపి లో చేరుతున్నారు. తాజాగా MLC పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా..ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ లు తమ రాజీనామాను మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు అందజేయబోతున్నారు. గురువారం పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామా చేయగా.. ఆ వెనువెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వైదొలుగుతుండటంతో ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.