Two more bailed in phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని కండీషన్ విధించింది. అలాగే పాస్‌పోర్టులు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ దర్యాప్తునకు సహకరించాలని..సాక్షులను ప్రభావితం చేయరాదు అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇకపోతే ఇప్పటికే అదనపు ఎస్పీ భుజంగరావు ఇప్పటికే అనారోగ్యం రీత్యా బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే రాధాకిషన్ రావు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ రావాల్సి ఉంది.

Advertisements
image

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పోలీసు ఉన్నతాధికారులను ఊచలు లెక్కబెట్టిస్తోంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు ఎం తిరుపతన్న, ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ (టాస్క్ ఫోర్స్) రాధా కిషన్ రావులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్న భుజంగరావు మినహా మిగిలిన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ కేసులో అదనపు ఎస్పీ ఎం తిరుపతన్న రెగ్యులర్ బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ( టాస్క్ ఫోర్స్)రాధా కిషన్ రావులకు బెయిల్ లభించింది. అయితే బెయిల్‌కు సంబంధించి పలు కండీషన్లు విధించారు న్యాయమూర్తి. లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని అలాగే పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని…సాక్ష్యులను ప్రభావితం చేయరాదని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇప్పటికే ఎన్ భుజంగరావు బయటే ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాధా కిషన్ రావు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ప్రణీత్ రావు ఇంకా జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ప్రణీత్ రావు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉంది.

Related Posts
Fishing Ban : ఏపీలో ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం
Fishing ban in AP from 15th of this month

Fishing Ban : ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ … కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా Read more

హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Heavy cases of drunk and driving in Hyderabad

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించినా మందుబాబుల తీరు మారలేదు. మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ Read more

Firecracker Factory Blast : బాణసంచా ప్రమాదం రూ.15 లక్షల చొప్పున పరిహారం
Firecracker Factory Blast బాణసంచా ప్రమాదం రూ.15 లక్షల చొప్పున పరిహారం

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది కైలాసపట్నంలోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఊహించని విధంగా ఎనిమిది కుటుంబాల్లో కన్నీరును Read more

కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది: కేటీఆర్‌
brs will always stand by workers ktr 222

హైదరాబాద్‌: తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండ‌ర్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే నాయ‌కుడి విలువ తెలుస్త‌ద‌ని కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు Read more

Advertisements
×