Two key agreements in Telangana on the same day

తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు

ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగులను తొలగించిన హైడ్రా

హైదరాబాద్‌: తెలంగాణకు గూగుల్ గుడ్‌ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే రోజు మైక్రోసాఫ్ట్‌తో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

తెలంగాణకు గూగుల్ గుడ్‌ న్యూస్

హైదరాబాద్‌లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. టీ హబ్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. వ్యవసాయం, విద్య, రవాణ రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు ఈ గూగుల్ ఏఐ కేంద్రం బాగా సహకరిస్తుందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.

ఇదే రోజు మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు.

“హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.” అని రేవంత్ కామెంట్స్ చేశారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతోపాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నాయి.

Related Posts
చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.300 కోట్లు విడుదల
Rs. 300 crore released for Chakali Ilamma University

హైదరాబాద్‌: తెలంగాణ వీరనారిగా పిలువబడే చాకలి ఐలమ్మ పేరిట గల కోఠిలోని మహిళా యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ Read more

రోడ్డు భద్రతపై హోండా స్కూటర్ ప్రచారం
Honda Motorcycle and Scooter India awareness campaign on road safety

2200 మంది పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బందికి అవగాహన కల్పించిన ప్రచారం.. సిద్దిపేట : రహదారి భద్రత కోసం కొనసాగుతున్న ఈ నిబద్ధతలో భాగంగా, హోండా మోటార్‌సైకిల్ Read more

కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్
కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాటు ర్యాట్ హోల్ మైనర్లు కూడా Read more

మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్
harish rao arrest

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. గురువారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు Read more