ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకొని షాక్ అందరికి ఇచ్చింది. ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్ని అవాస్తం అని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

హైకోర్టు సైతం బాధిత మహిళతో మాట్లాడింది. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్‌ వేశానని, ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని తెలిపింది. దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీచేసే నిమిత్తం విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే.కృపాసాగర్‌ ఉత్తర్వులిచ్చారు.

అసలు ఏంజరిగిందంటే..

తనను బెదిరించి ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు తిరుపతి తూర్పు పోలీస్​ స్టేషన్​లో కొద్దీ రోజులుగా క్రితం ఫిర్యాదు చేశారు. అలాగే పలు వీడియోస్ సైతం సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద ఆదిమూలంపై కేసులు నమోదు చేసారు పోలీసులు. అటు టీడీపీ అధిష్టానం సైతం ఆదిమూలం ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.