ఏడాది క్రితం వచ్చిన హిందీ డ్రామా సిరీస్ “తుక్రా కే మేరా ప్యార్” అనే డ్రామా సిరీస్, ప్రధాన పాత్రలుగా ధవళ్ ఠాకూర్ మరియు సంచిత బసూ నటించిన ఈ సిరీస్ గత ఏడాది నవంబర్ 22 నుండి డిసెంబర్ 13 వరకు విడుదలైనది. ఇటీవలి కాలంలో ఈ సిరీస్ తెలుగులో కూడా ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చింది. శ్రద్ధా పాసి జైరత్ దర్శకత్వం వహించారు.
కథ:
ఉత్తరప్రదేశ్ లోని ‘సితార్ పూర్’ పరిధిలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో మనోహర్ చౌహన్ పెత్తనం నడుస్తూ ఉంటుంది. శ్రీమంతుడు,రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు కావడం వలన, అతనికి అంతా భయపడుతూ ఉంటారు. తాను రాజకీయం చేస్తూ, తన తమ్ముడైన పుష్కర్ తో రౌడీయిజానికి సంబంధించిన పనులు చేయిస్తూ ఉంటాడు. చౌహాన్ కూతురే శాన్విక (సంచిత బసూ). ఆమె అంటే అతనికి ప్రాణం.ఆ గ్రామంలోనే కులదీప్ కుమార్ ( ధవళ్ ఠాకూర్) తన పేరెంట్స్ తోను చెల్లెలితోను కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్లది నిరుపేద కుటుంబం. కులదీప్ తండ్రి, చౌహాన్ బోట్స్ రిపేర్ చేసే పనులు చేస్తూ ఉంటాడు. కులదీప్ తల్లి చౌహాన్ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. శాన్విక కాలేజ్ లోనే చదువుతున్న కులదీప్, ఆ కాలేజ్ కి టాపర్. అందువలన అతని పట్ల శాన్వికకి గల అభిమానం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. కులదీప్ – శాన్విక ప్రేమవ్యవహారం అదే కాలేజ్ లో చదువుతున్న ఒక అల్లరిమూకకి తెలుస్తుంది. వాళ్ల ద్వారా ఆ విషయం చౌహాన్ బ్రదర్స్ చెవిన పడుతుంది. దాంతో చౌహాన్ కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోతారు. ఆ సమయంలో తనకేమీ తెలియదన్నట్టుగా శాన్విక ప్రవర్తిస్తుంది. దాంతో కులదీప్ కుటుంబ సభ్యులను చౌహాన్ గ్యాంగ్ ఇంట్లోనే బంధించి నిప్పు అంటిస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఎలాగో బయటపడిన కులదీప్ కుటుంబ సభ్యులు, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంటారు.

విశ్లేషణ:
ఈ కథలో ప్రేమకు పెద్దలతో మరియు పేదరికంతో సంబంధించిన అవరోధాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. ప్రేమలో ఉండే అవరోధాలను దాటుకుని ఇద్దరూ గెలవడమే, కథకు ప్రధాన అంశం. కానీ, ప్రేమికుడు ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయి ఎందుకు విడిచి పోతుందనే ప్రశ్నకు సమాధానం ఈ సిరీస్ లో ఉంటుంది.ఒక పేద కుటుంబం ఒక శ్రీమంతుల కుటుంబం మధ్య ప్రేమ విషయంగా జరిగే పోరాటమే ఈ కథ అని చెప్పుకోవచ్చు. 19 ఎపిసోడ్స్ గా ఆవిష్కరించిన ఈ కథ ఎక్కడా బోర్ అనిపించదు. లవ్ , యాక్షన్ , ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలను దర్శకుడు కనెక్ట్ చేయగలిగాడు.
పనితీరు:
ఈ సిరీస్‌లో ముఖ్యంగా నటించిన ఆర్టిస్టులు మంచి పనితీరు కనబరచారు. ముఖ్యంగా, సంచిత బసూ తన పాత్రలో అద్భుతంగా నటించింది.
సాంకేతిక అంశాలు:
కథ స్క్రీన్ ప్లే పకడ్బందీగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ నేపథ్య సంగీతం కూడా ఈ సిరీస్ ప్రధానమైన బలంగా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు.ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.