మే నెల దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..!

మే నెల దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..!

రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో మే నెల దర్శన టికెట్లు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇక, 21వ తేదీ ఉదయం ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.

Advertisements
మే నెల దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..!

వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేసేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది టీటీడీ.. 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనుండగా.. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కాబోతున్నాయి. ఇక, 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్టు టీటీ డీవెల్లడించింది.

Related Posts
ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
man commits suicide by hang

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, Read more

APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
APPSC Group2

2025 జనవరి 5 న నిర్వ్హయించాలనుకున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. గ్రూప్ -2 ఉద్యోగానికి సిద్దమయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. Read more

న్యాక్ కేసులో విజయవాడ జైలుకు నిందితులు
న్యాక్‌ కేసు,నిందితులను విజయవాడ జైలుకు తరలింపు..

న్యాక్ ర్యాంకింగ్‌ స్కామ్‌లో 10 మందిని కోర్టు 15 రోజుల రిమాండ్‌కు పంపించింది. ఈ నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. డిసెంబర్ 1వ తేదీన CBI Read more

నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త
summer temperature

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 18 వరకు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా Read more

Advertisements
×