TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. ఈ పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్‌, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలతో పాటు ఆర్జితసేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశికి నలబై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ ఆదేశించారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

Related Posts
Central Financial Assistance : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు కోట్లు అప్పుల భారం
Central Financial Assistance తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు కోట్లు అప్పుల భారం

Central Financial Assistance : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు కోట్లు అప్పుల భారం ఆంధ్రప్రదేశ్‌కు 2025 మార్చి 31 నాటికి మొత్తం రూ.5,62,557 కోట్లు అప్పు ఉంటుందని, తెలంగాణ అప్పు Read more

మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల..!
మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల

కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు ప్రసిద్ధ వచనం "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే Read more

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
Distribution of pensions in

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి Read more

తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..
gas leak tamilanadu

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కెమికల్ గ్యాస్ లీక్ జరిగి, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు విద్యార్థులు Read more