తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణలో ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్‌ కీతో పాటు ప్రిలిమ్స్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు మెరిట్ జాబితాను https://tspsc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్‌-1 పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించగా.. మూల్యాంకన ప్రక్రియకు నాలుగు వారాల సమయం పట్టింది. తాజాగా ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచారు. 563 పోస్టులకు జూన్ 09న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ను క్లియర్ చేసి.. మెయిన్స్ పరీక్షకు వెళ్లడానికి అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నంబర్‌లను జాబితాను రిలీజ్ చేసింది.