అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినపుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయి లో విరుచుకుపడుతోంది అభినందించారు.ఈ ఒప్పందం విషయాన్నీ అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది.

అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొంది .వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది.ఈ విషయాన్నీ ఆదివారమే విదేశాంగ శాఖ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది.