trump

పలు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ట్రంప్‌ సంతకాలు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టగానే తనదైన స్టైల్లో పాలనను మొదలు పెట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రంప్‌ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజే ఏకంగా వందకు పైగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల పై సంతకాలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్‌ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష, జన్మతః పౌరసత్వంపై వేటు వంటి వందకు పైగా అంశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఇప్పుడు అధ్యక్షుడి చేతిలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఓ పవర్‌ఫుల్ ఆయుధంలా మారింది. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అంటే ఏమిటంటే.. అధ్యక్షుడు ఏకపక్షంగా తనకు సంక్రమించిన అధికారాలతో జారీ చేసే ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లుగా వ్యవహరిస్తారు. ఇవి చట్టాల వలే చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గత అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేందుకు కూడా కొత్త అధ్యక్షులు ఈ ఎగ్జిక్యూటివ్‌ను ఉపయోగించుకుంటుంటారు. ఈ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఉంటాయి. ఇక వీటి అమలుకు ఎవరి ఆమోదం అవసరం ఉండదు. దీనికి అమెరికన్‌ పార్లమెంట్‌ ఆమోదం కూడా అవసరం లేదు.

చట్ట సభ ఆమోదం లేకుండా జారీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకించలేనప్పటికీ.. నిధుల విషయంలో వీటి అమలుకు అడ్డంకులు సృష్టించొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడికే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. అమెరికా చరిత్రలో వేల కొద్దీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ అయ్యాయి. జార్జ్ వాషింగ్టన్ ఎనిమిది ఆర్డర్లపై సంతకాలు చేస్తే.. ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ అత్యధిక ఆర్డర్లపై సంతకాలు చేశారు.

Related Posts
కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

షట్‌డౌన్‌ గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు Read more

ఎలోన్ మస్క్ OpenAI పరిశోధకుడిపై షాకింగ్ వ్యాఖ్యలు
ఎలోన్ మస్క్ OpenAI పరిశోధకుడిపై షాకింగ్ వ్యాఖ్యలు

ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెక్నాలజీ పరిశోధకుడు మరియు ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ Read more

Venezuela :జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?
జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?

లాటిన్ అమెరికాలో అత్యంత భయానకమైన క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన 'ట్రెన్ డెరావువా' వెనిజ్వెలాలోని టొకోరాన్ జైలులో భారీ స్థావరాన్నే ఏర్పాటుచేసుకుంది. జూ, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్, బెట్టింగ్ షాప్, Read more

ట్రంప్ దూకుడుతో అయోమయంలో ఉద్యోగులు
25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

కరోనాతో కకలావికలం అయిన ఆర్థిక వ్యవస్థలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని త్రైమాసికాలుగా తేరుకుంటూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక వృద్ధి Read more