‘మీకేం పని లేదా.. ఎందుకు ఢిల్లీ వస్తున్నారు..? ‘ అంటూ తెరాస ఎంపీలను అవమానిస్తున్న కేంద్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో వరి యుద్ధం నడుస్తుంది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోలనలు చేపట్టారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు , రాస్తారోకోలు , దీక్షలు చేపడుతూ వస్తున్నారు. ఈ నెల 11 న ఢిల్లీ లో 1500 మందితో భారీ ధర్నా కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగానే తెరాస ఎంపీలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు దిల్లీకి వస్తే.. ‘మీకేం పని లేదా.. ఎందుకు దిల్లీ వస్తున్నారు..?’ అని తెరాస మంత్రులు, ఎంపీలను అవమానించే విధంగా కేంద్ర మంత్రులు మాట్లాడారని ఎంపీలు మీడియా తో మాట్లాడారు. తెలంగాణ భారతదేశంలోనే ఉంది కదా.. అలాంటప్పుడు రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష? కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు.. మా విషయంలో కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించాలి. తెలంగాణ రైతులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం విధానాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలో మా ముఖ్యమంత్రికి బాగా తెలుసు. వారికి అండగా ఉంటాం.. రైతాంగాన్ని కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం అని తేల్చి చెప్పారు తెరాస ఎంపీలు.