immigrants

అమెరికాలో వణికిపోతున్న భారతీయులు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ప్రధానంగా మెక్సికో వంటి దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన లక్షణ మంది ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 1.4 కోట్ల మంది చట్టపరమైన డాక్యుమెంట్లు లేని ఇమ్మిగ్రెంట్లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 7.25 లక్షల మంది భారతీయ పౌరులు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి వారిని ఏరిఏరి వారి దేశాలకు పంపించే పనిలో ట్రంప్ ప్రస్తుతం ఉన్నారు. అక్రమ వలసలను అడ్డుకోవటానికి ట్రంప్ సర్కార్ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం ఉండటంతో లక్షల మందిలో ఆందోళనలు మెుదలయ్యాయి. అలాగే అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణ పనులు సైతం వేగవంతంగా కొనసాగుతున్నాయి.

Advertisements
 అమెరికాలో వణికిపోతున్న భారతీయులు

2024లో Pew రీసెర్చ్ అందించిన రిపోర్టు ప్రకారం అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిలో భారతీయులు మూడవ అతిపెద్ద సమూహంగా ఉన్నట్లు వెల్లడైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 192 దేశాలకు చెందిన 2,70,000 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులను వారి దేశాలకు డిపోర్ట్ చేసింది. అయితే వీరిలో భారతీయులు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం పగ్గాలు మారితన తర్వాత ట్రంప్ అమెరికన్లకు ప్రాధాన్యత పెంచాలని, అమెరికాను ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తిరిగి మార్చాలని భావిస్తున్న వేళ అక్రమంగా అమెరికాలో నివశిస్తున్న ప్రజలను డిపోర్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts
ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయిన నావ..గంటా శ్రీనివాసరావు
ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయిన నావ..గంటా శ్రీనివాసరావు

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ Read more

Sitarama Sagar: మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి : మంత్రి ఉత్తమ్
Sitarama project to be completed in three years.. Minister Uttam

Sitarama Sagar: సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను Read more

ఎస్సీ రిజర్వేషన్లు: కమిషన్ సిఫారసులు ఇవే
reservation

తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొత్త మార్పులు ప్రతిపాదించబడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కమిషన్ నివేదికపై ముఖ్యమైన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో 15 శాతం Read more

ఉక్రెయిన్ నాటో సభ్యత్వం: శాంతి కోసం జెలెన్స్కీ కీలక అభిప్రాయం
nato 1

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో, నాటో సభ్యత్వం ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి శాంతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగా, ఉక్రెయిన్‌లోని Read more

×