గోదావరి ఉదృతి..తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్

గోదావరి ఉదృతి గంట గంటకు పెరుగుతుండడం తో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్ చేసారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో తెలంగాణా, చతిస్గడ్ కు రాకపోకలు స్తంభించాయి. అటువైపు వాహనాలను వెళ్ళకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.