Transgender on traffic duty from today

నేటి నుండి ట్రాఫిక్‌ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్‌ గుర్తులు, డ్రిల్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. కుటుంబం, సమాజంలో ట్రాన్స్‌ జండర్లు ఎంతో వివక్షకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని, వారిని సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మొదటి సారిగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డు క్యాడర్‌ కింద ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.

తొలి దశలో భాగంగా మొత్తం 44 మంది ట్రాన్స్ జెండర్లు నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాలను నియంత్రిస్తారు. నగర పోలీసులు దీనిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో ఎంపికైన ట్రాన్స్ జెండర్ల డ్రిల్ ను కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Related Posts
Janasena : డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన
DMK invited...didn't go: Janasena

Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల Read more

కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్
paadi

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దళితబంధు రెండో విడత నిధుల పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 20 వరకు నిధులు అందకపోతే Read more

భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో భూగర్భజల మట్టాలు పడిపోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల్లోనే భూగర్భజల మట్టం Read more

ఐటీలో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
We will create more jobs in IT.. Minister Sridhar Babu

సాంకేతికత ప్రతి ఒక్కరికీ చేరాలని తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్య.హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 32వ హైసియా (హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌లో Read more