నెల రోజుల పాటు పలు రూట్లలో రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. నెల రోజుల పాటు పలు రూట్లలో రైళ్లు రద్దు కాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్ మర్మతుల కారణంగానే రైళ్లు రద్దు చేస్తున్నారు. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్ లో సిగ్నల్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

రద్దు కాబడిన రైళ్లు చూస్తే..

17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుంచి జులై 6 వరకు
12757/58 కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుంచి జులై నెల 6 వరకు
12967 చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జులై 2,7 తేదీల్లో రద్దు
12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 23, 28, 30, జులై 5న రద్దు
12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జులై 4, 6 తేదీల్లో రద్దు
12539 యశ్వంత్‌పూర్-లక్నో ఈ నెల 26, జులై 3న రద్దు
12540 లక్నో-యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు
12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు
22619 బిలాస్‌పూర్-త్రివేండ్రం తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జులై 2 రద్దు
22620 త్రివేండ్రం-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు
22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జులై 5వ తేదీల్లో రద్దు
22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జులై 1, 8 తేదీల్లో రద్దు