ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కూలీని మట్టిదిబ్బల నుంచి బయటకు తీసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. మట్టి దిబ్బల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ,
డి ఆర్ డిఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. సెల్లార్ కోసం తీసిన గుంతలు
లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంకోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది . ఫైల్స్ లో కాంక్రెట్ నింపుతుండగాఫై నుంచి మట్టి జారి పడిపోవడంతో కార్మికులు దానికిందచిక్కుకుపోయారు.భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి .క్షత్రగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు . భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్ నుంచి వచ్చిన కార్మికులువిధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది .ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.