Today ycp statewide agitations on the increase in electricity charges

నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నేడు(శుక్రవారం) ప్రతిపక్ష వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం వైసీపీ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పవర్ లోకి వచ్చి 6 నెలలు కాకముందే ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది.

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు మెమోరాండం సమర్పించేందుకు సిద్ధమయ్యారు.

కాగా, అయితే 2022-23 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో రూ. 6200 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు.. అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, విద్యుత్ వినియోగాదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

Related Posts
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు Read more

ఆ భూములను వెనక్కి తీసుకుంటాం – పొంగులేటి
Special App for Indiramma Houses . Minister Ponguleti

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైన కొత్త ROR చట్టాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం Read more

పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట..బాలుడి పరిస్థితి విషమం
sandhya thater

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల Read more

ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ
etela metro

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో Read more