Tirupati Deputy Mayor Election Postponed

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..

అమరావతి: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్‌ హాలులో ప్రిసైడింగ్‌ అధికారి శుభం బన్సల్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్‌ ప్రకటించారు. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. 22 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైంది.

కాగా, తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 22 మంది కూటమికి మద్దతు తెలిపారని, మరో 6 మంది రేపు ఉదయం వస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు.

image

భూమన కరుణాకరరెడ్డి గతంలో ఎన్నో అరాచకాలు చేయగా తిరుపతి ప్రజలందరూ చూశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కరుణాకరరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసిపి అనేక అరాచకాలకు పాల్పడింది. దొంగ ఓటరు కార్డులు తయారు చేయించి తమిళనాడు నుంచి వ్యక్తులను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేయించారు. మేం ఎలాంటి దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడలేదు. తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరగాలి. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కరుణాకర్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డుతున్నారని’ కిరణ్ రాయల్ మండిపడ్డారు.

Related Posts
జగన్ కేసులపై విచారణ వాయిదా
ap cm ys jagan 1

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లో సీబీఐ, ఈడీలు తన పరిశోధన వివరాలను నిన్న కోర్టులో ఫైల్ Read more

గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు డీమ్డ్ యూనివర్శిటీ అప్లికేషన్స్
Deemed University inviting applications for undergraduate programmes

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ యూనివర్శిటీగా పేరుతెచ్చుకున్న సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ Read more

చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ
chinmaya krishna das

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను Read more

చలి వలన గాజాలో మరణాలు..
gaza's death due to cold

గాజాలో చలి కారణంగా మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది గత వారం రోజుల్లో మృతిచెందిన ఆరు చిన్నారులలో ఇది ఒకటి. ఒక నెల వయస్సున్న అలీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *