భార్యను లాక్కెళ్లిన పులి.. సోషల్ మీడియాలో మళ్ళీ మళ్ళీ పోస్టుతో వైరల్

Tiger: భార్యను లాక్కెళ్లిన పులి.. సోషల్ మీడియాలో మళ్ళీ మళ్ళీ పోస్టుతో వైరల్

భర్తతో గొడవపడి కారు దిగిన మహిళను ఒక పెద్ద పులి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మరికొన్ని వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. అందరి కళ్ల ముందే పులి ఆ మహిళను లాక్కెళ్లిపోయింది. ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను కనుగొనేందుకు సజగ్ బృందం ప్రయత్నించగా.. ఇది నిజమేనని తేలింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ మహిళకు
భర్తతో గొడవ తర్వాత కారు దిగిన మహిళను పెద్ద పులి లాక్కెళ్లింది – ఇన్‌స్టాగ్రామ్‌లో Pratahkal.live అనే ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ.. మహిళను పులి అడవిలోకి లాక్కెళ్లిందని రాశారు. . భర్త తన భార్యను కాపాడుకునేందుకు వేగంగా స్పందించాడని కొందరు కామెంట్లు పెట్టారు.

Advertisements

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు మేం (సజగ్ బృందం) ఈ వీడియో నుంచి కొన్ని కీఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ట్విట్టర్‌లో గత కొన్నేళ్లుగా పలు హ్యాండిల్స్‌ నుంచి ఈ వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం.ఈ పోస్టులను పరిశీలించిన తర్వాత ఈ వీడియో ఇప్పటిది కాదని నిర్ధారణకు వచ్చాం.
ఈ ఘటన 2016లో చైనాలో జరిగింది

ఈ ఘటన 2016లో చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో జరిగింది. ABC వార్తా కథనంలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఈ కథనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బీజింగ్‌లోని బడలింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఒక కుటుంబం సఫారీ చేసేందుకు వచ్చింది. వారి వాహనం సైబేరియన్ టైగర్ ఎన్‌క్లోజర్‌లో ఉండగా.. మహిళ తన భర్తతో గొడవపడి కారు నుంచి కిందికి దిగింది. దీంతో పులి ఒక్కసారిగా దాడి చేసి ఆమెను లాక్కెళ్లింది.
డ్రైవర్ సీట్లో ఉన్న భర్త వెంటనే తన భార్యను కాపాడుకునేందుకు ప్రయత్నించినా.. అతడి ప్రయత్నం ఫలించలేదు. పులి ఆమెపై దాడి చేసి చంపేసింది.

Related Posts
యెమన్ లో ఇస్రాయెల్ దాడి..
Yemen Israel

గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రకటన ప్రకారం, ఇస్రాయెల్ వాయు దాడి కారణంగా గాజాలో 50 మంది మరణించారు. ఈ దాడి గాజా ఉత్తరంలో ఉన్న Read more

ఎర్ర సముద్రంలో అమెరికా నేవీ F/A-18 కాల్పులు
red sea

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, డిసెంబర్ 22 తెల్లవారుజామున ఎర్ర సముద్రం మీదుగా ఇద్దరు U.S. నేవీ పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారు. వీరి F/A-18 ఫైటర్ జెట్ Read more

2వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు
కొత్త ఎలక్ట్రానిక్స్ సుంకాలు: తాత్కాలిక మినహాయింపులు

యూఎస్​ఎయిడ్ వెబ్​సైట్​లో ఓ నోటీసు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా Read more

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain passed away

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×