three cis and 13 sis were suspended in vikarabad

వికారాబాద్‌లో ముగ్గురు సీఐలు, 13మంది ఎస్‌ఐలు సస్పెన్షన్

three-cis-and-13-sis-were-suspended-in-vikarabad
three-cis-and-13-sis-were-suspended-in-vikarabad

హైదరాబాద్: అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్వోలుగా కొనసాగిస్తూ మల్టీజోన్-2 ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో ఉంచిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు. వీరిలో ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.త్వరలో వారిని లూప్లైన్కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా,అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కీలక కేసుల్లో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కథనాలు రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Related Posts
సల్మాన్తో నేను డేట్ చేయలేదు – ప్రీతి జింటా
salman khan preity zinta

బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ క్రికెట్ టీమ్ యజమాని ప్రీతి జింటా, సల్మాన్ ఖాన్‌తో తన సంబంధంపై క్లారిటీ ఇచ్చారు. "నేను ఎప్పుడూ సల్మాన్ ఖాన్‌ను డేట్ Read more

సర్పంచ్ ఎన్నికల్లో ‘కోతుల పంచాయితీ’
'Monkey Panchayat' in Sarpanch Elections

కోతుల బెడదను తీర్చే వారికి ఓటేస్తామంటున్న జనం హైదరాబాద్‌: ఈసారి పంచాయతీ​ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘కోతుల తిప్పలు’ తప్పేలా లేవు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, Read more

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది: ప్రధాని
Prime Minister Modi speech in the Parliament premises

న్యూఢిల్లీ : ఈరోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో Read more

నిర్మాత మనో అక్కినేని కన్నుమూత
Producer Mano Akkineni pass

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన మనో అక్కినేని ఈ నెల 19న కన్నుమూశారు. అయితే ఈ విషాదకర సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read more