కుల గణన ను ఉద్యమ కార్యక్రమం లా తీసుకొని పూర్తి చేశారు. కుల గణన నివేదిక ను క్యాబినెట్ సబ్ కమిటీ కి ఇచ్చింది. వివిధ అంశాలు చర్చించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల ముందు చెప్పినట్లు కుల సర్వే చేశాం. కుల గణన లో వివరాలు ఇవ్వని వారు ఇప్పటికైనా ఇవ్వవచ్చు ప్రధాన రాజకీయ పార్టీల పెద్ద నేతలు కూడా కుల సర్వే కి వివరాలు ఇవ్వలేదు. మండల స్థాయి అధికారులకు వివరాలు ఇవ్వండి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ తరుపున స్వాగతిస్తున్నాం.. సమర్థిస్తున్నాం.ప్రతిపక్ష పార్టీలు కూడా మీ అభిప్రాయాన్ని రేపు అసెంబ్లీ లో తెలపండి.బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది దానిని ఎవరు అడ్డుకోవాలని చూసినా ఊరుకోరు.ఈ కార్యక్రమానికి అడ్డుపడే శక్తులు ఉంటే వారిని అడ్డుకొని ముందుకు పోవాలని కోరుతున్నా.
ఇది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. నిర్ణయం నుంచి నివేదిక వరకు తీసుకు వెళ్లినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న. అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు, బీసీ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ, అభినందిస్తూ సంబరాలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలు వస్తె దాడులు చేశారు..అవమానించారు.
గతంలో మాదిరి ఆల్మారాలో ఫ్రీజ్ లో నివేదిక పెట్టే ప్రభుత్వం మాది కాదు. హిడెన్ ఎజెండా కోసం రిపోర్ట్ ఉపయోగించం.కవిత ఒక్కరే సర్వే కు వివరాలు ఇచ్చారు. వారి కుటుంబంలో ఎవ్వరు వివరాలు ఇవ్వలేదు.మీకు ఏం అయిన అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి.
వివరాలు ఇవ్వని వారు ఎందుకు ఇవ్వలేదో కవిత ప్రశ్నించాలి కేసీఆర్ రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక ఆహ్వానం ఏం అందజేయం. అసెంబ్లీ సెక్రటరీ అందరూ ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపుతారు.బీసీ ల పై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ రేపు సభకు హాజరవుతారు.కొత్తగా ప్రభుత్వం సర్వే నిర్వహించక పాత సర్వే తో పనేం ఉంది.