vijayasai reddy

జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు.

తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని… అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్… ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు.

Related Posts
అహ్మదాబాద్ కొల్డ్‌ప్లే కాన్సర్టు: టికెట్ల రెసెల్లింగ్ దరల పై చర్చ
coldplay

కొల్డ్‌ప్లే యొక్క అహ్మదాబాద్‌లో జరిగే కాన్సర్టు టికెట్లు అధికారికంగా అమ్మకానికి పెట్టగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే అవి రీసెలింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించాయి. టికెట్లు మళ్లీ విక్రయించబడటంతో, అవి Read more

కుంభమేళా భక్తులకు సగం ధరకే విమాన టికెట్ల ధరలు
kumbh mela flight charges

కుంభమేళా సందర్భంగా భక్తులకు సగం ధరకే విమాన టికెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడనుంది. Read more

కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి: సమాజ్వాదీ పార్టీ
కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి సమాజ్వాదీ పార్టీ

సమాజ్వాదీ పార్టీ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ప్రయాగ్రాజ్లోని కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరం అని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. ఇందులో Read more

ఉత్తరాఖండ్‌లో ఈరోజు నుండి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
uttarakhand to implement uniform civil code from today

డెహ్రాడూన్‌: యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి - యూసీసీ) అంటే… యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *