కేజ్రీవాల్‌కు బెయిల్‌పై సుప్రీంకోర్టు షరతులు ఇవే..

These are the Supreme Court's conditions on Kejriwal's bail.
These are the Supreme Court’s conditions on Kejriwal’s bail.

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీ రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేజ్రీకి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే..
.రూ.10లక్షల బాండ్‌ సమర్పించాలి
.కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు
.కేసు విచారణ కోసం ట్రయల్‌ కోర్టు ఎదుట హాజరుకావాలి
.ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదు
.అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదు