CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో.. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మాట్లాడుతూ..పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదు అని సీఎం తేల్చి చెప్పారు.

సన్నబియ్యం మన పథకం.. మన పేటెంట్
మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. తెలంగాణ పథకాలతో ప్రధాని మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ మోడల్‌పై దేశంలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయి. సన్నబియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.
1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతా
రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతా. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి.. బుల్డోజర్లు పంపిస్తున్నారని ప్రధాని మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు