డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

Diego Maradona: డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చనిపోయిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయన మృతికి గల కారణం తెలిసింది. మారడోనా వేదనతో మరణించి ఉంటాడని పోస్టుమార్టంలో పాల్గొన్న ఒక నిపుణుడు తెలిపారు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్య నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకున్న నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు.

Advertisements
డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు
మారడోనా గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు ఉందని డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించి ఉంటాడని వివరించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న మారడోనా నవంబర్ 25, 2020న 60 ఏళ్ల వయసులో బ్యూనస్ ఎయిర్‌లోని అద్దె ఇంట్లో మరణించాడు. మారడోనా కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్‌ వ్యసనంతో బాధపడ్డాడు.
నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి (పల్మనరీ ఎడెమా) కారణంగా మరణించినట్టు గుర్తించారు.

Related Posts
మోడీతో గూగుల్ CEO భేటీ – డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు

మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య జరిగిన Read more

మిస్ వరల్డ్ – భారత్ తరఫున పోటీలో ఈమెనే
nandini gupta

ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు Read more

విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్
విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్

భారత పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు దారుణమైన సంఘటనకు గురైంది. ఈ పర్యటనలో భాగంగా, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో Read more

యువీ కి క్యాన్సర్ ఉందని తెలియదు: సచిన్ కామెంట్స్
యువీ కి క్యాన్సర్ ఉందని తెలియదు సచిన్ కామెంట్స్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితం లోని ఆసక్తికరమైన అనుభవాలను ఇటీవల పంచుకున్నారు ప్రముఖ ఆటగాళ్లైన సెహ్వాగ్, యువరాజ్, ద్రవిడ్ లతో కలిసి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×