yoshitha rajapaksa

శ్రీలంక‌ మాజీ దేశాధ్య‌క్షుడి కుమారుడు అరెస్టు

శ్రీలంక మాజీ దేశాధ్య‌క్షుడు మ‌హింద రాజ‌ప‌క్స కుమారుడు యోషితా రాజ‌ప‌క్స‌ను అరెస్టు చేశారు. ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజ‌ప‌క్స పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బెలియ‌ట్టా ప్రాంతంలో త‌న స్వంత ఇంట్లో మాజీ నేవీ ఆఫీస‌ర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసులో.. శ్రీలంక మాజీ దేశాధ్య‌క్షుడు మ‌హింద రాజ‌ప‌క్స కుమారుడు యోషితా రాజ‌ప‌క్స‌ ను అరెస్టు చేశారు. ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజ‌ప‌క్స పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2015 క‌న్నా ముందు.. తండ్రి మ‌హింద రాజ‌ప‌క్స అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. యోషితా ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మ‌హింద‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. దాంట్లో యోషితా రెండో వ్య‌క్తి. ఇదే ప్రాప‌ర్టీ అంశంలో మ‌రో మాజీ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్స‌ను కూడా విచారించారు. త‌న‌కు సెక్యూర్టీ క‌ల్పించాల‌ని కోరుతూ ప్రాథ‌మిక హ‌క్కుల కింద మ‌హింద రాజ‌ప‌క్స సుప్రీంకోర్టులో పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ కుమారుడిని అరెస్టు చేయ‌డం శ్రీలంక‌లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అనుర కుమార దిశ‌నాయ‌కే.. శ్రీలంక‌ అధ్య‌క్షుడిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. మ‌హింద పెద్ద కుమారుడు న‌మ‌ల్ రాజ‌ప‌క్స‌ను కూడా మ‌రో ప్రాప‌ర్టీ కేసులో పోలీసులు విచారించారు.

Related Posts
అమెరికా-చైనా వాణిజ్య వివాదం…
US China 1

చైనా యొక్క ప్రభుత్వ మాధ్యమాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సరుకు పై అదనపు టారిఫ్‌లు విధించే మాటలు, ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల మధ్య Read more

ఇక పై అమెరికాన్లకు సువర్ణయుగమే: ట్రంప్‌
Donald trump speech

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో ట్రంప్‌ ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూన్నారు. అమెరికా ఇలాంటి వియం ఎన్నడూ చూడలేదని ట్రంప్‌ అన్నారు. అమెరికన్లకు సువర్ణయుగం Read more

మరో 487 వలసదారుల బహిష్కరణ
మరో 487 వలసదారుల బహిష్కరణ

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయ వలసదారులను త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేశారని, వారిపై Read more

జింబాబ్వే పోలీసుల మొబైల్ ఫోన్ల వాడకం పై నిషేధం
Zimbabwe Police

జింబాబ్వే ప్రభుత్వం దేశంలోని పోలీసుల డ్యూటీ సమయంలో మొబైల్ ఫోన్లు వాడకంపై కొత్త నిబంధనను అమలు చేసింది. ఇప్పుడు దేశంలోని పోలీస్ అధికారులకు తమ విధుల్లో ఉంటున్నప్పుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *