police

కారులో వెళ్తున్న దుండగులను కాల్చిన పోలీసులు-ఇదిగో వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్‌ చేసి కాల్చిచంపారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్‌ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు మంగళవారం ఉదయం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో మాటువేసి ఆ దుండగులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను పసిగట్టిన దుండుగులు కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎస్టీఎఫ్‌ పోలీసులు వారిని సినీ ఫక్కీలో వెంబడించారు. షామ్లీ జిల్లాలోని ఝిన్‌ఝనా ఏరియాలో వారి వాహనాన్ని చుట్టుముట్టారు.

దుండుగులు పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ ముస్తఫా ముఠాకు చెందిన అర్షద్‌, మంజీత్‌, సతీష్‌తోపాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఎస్టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో దుండగులు ప్రయాణించిన వాహనాన్ని కింది వీడియోలో చూడవచ్చు.

Related Posts
థాయిలాండ్ లో వివాదాస్పద బిల్లుకు ఆమోదం
Casino

క్యాసినో, గ్యాంబ్లింగ్‌లను లీగల్ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు థాయిలాండ్ కేబినెట్ ఆమోదం కల్పించింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటివరకు చట్ట వ్యతిరేకంగా ఉన్న క్యాసినో, గ్యాంబ్లింగ్‌లను చట్టబద్ధం Read more

యూపీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల సజీవదహనం
10 Children Killed As Fire Breaks Out At Hospital In UPs Jhansi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలోని నియోనటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. Read more

గ్రాండ్ లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ మరియు అన్సార్ జ్యువెలర్స్
Kisna Diamond Gold Jewelry and Answer Jewelers organized the Grand Lucky Draw programme

నంద్యాల : కిస్నా డైమండ్ & గోల్డ్ జువెలరీ, అన్సార్ జ్యువెలర్స్ భాగస్వామ్యంతో, నంద్యాలలోని సౌజన్య కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్ కిస్నా లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించింది. Read more

హైదరాబాద్ ప్రజలకు ఆన్ లైన్ కెఫే అనుభవాన్ని అందించనున్న జెప్టో కెఫే
Zepto Cafe will provide an online cafe experience to the people of Hyderabad

●హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన క్విక్ బైట్స్ ను ఇప్పుడు నిమిషాల్లోనే అందించనున్న జెప్టో.●జెప్టో యొక్క డార్క్ స్టోర్ నెట్‌వర్క్‌ ఇప్పుడు విపరీతంగా విస్తరిస్తోంది. కేవలం 15% మాత్రం Read more