ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు

BettingApps : ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు పంపించి, ఈరోజు సాయంత్రం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసులో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisements

పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరం

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు, యూట్యూబర్లు, సినిమా, టీవీ రంగాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా యువతను చెడుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో, దీనిపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా మరికొంతమందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖులకు నోటీసులు

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మంది పోలీసులు సోమవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ విష్ణుప్రియ, యూట్యూబర్‌, కమెడియన్‌ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. విచారణ తర్వాత మరికొందరికి సైతం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇన్‌‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్‌, టీవీ నటుల్లో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్‌ లింక్స్‌ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే గట్టి నిబంధనలు విధించింది. ఇలాంటి యాప్‌ల వల్ల ప్రజలు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా యువత ఈ వలలో చిక్కకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది.ఈ కేసులో మరికొంతమంది ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉందని, విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసి ప్రజలను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related Posts
రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని కవాడిగూడలో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మరో కేంద్ర మంత్రి Read more

కాంగ్రెస్ నేతల సవాల్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సై
paadi koushik

జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ఘటన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు రగిలిపోతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర చర్చలు, అభియోగాలు ఆరోపణలు నడుస్తున్నాయి. Read more

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

జనవరి 21 నుండి 23 వరకు దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు Read more

Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్

వాస్తవాలను అంగీకరించని వైసీపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వాస్తవాలను అంగీకరించే స్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మండలిలో వైసీపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×