ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, గౌతమ్ అదానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అదానీ చిన్నకుమారుడు జీత్ అదానీ పెళ్లిపీటలెక్కనున్నారు. జీత్ అదానీ, దివా జైమిన్ షా ల వివాహం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనుంది. ఈ వివాహం మాత్రం సంప్రదాయబద్ధంగా, ఎలాంటి హంగూఆర్భాటాలకు పోకుండా, ఆడంబరాలు లేకుండా సాధారణ మధ్య తరగతి పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో అలానే జీత్ అదానీ, దివా జైమిన్ షా పెళ్లిపీటలెక్కనున్నారు. దీంతో వీరి పెళ్లి చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు . ఆహ్వానితులు,ప్రపంచ కుబేరులు, సెలబ్రిటీస్ ఎవరూ ఈ వివాహ వేడుకకు హాజరు కావడంలేదు. కేవలం అదానీ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరగనుంది. ఫిబ్రవరి 5న పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించారు. సాంప్రదాయ పూజలతో పెళ్లి ప్రారంభం అయింది. జీత్ వివాహాన్ని సాధారణంగా,సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. సెలబ్రిటీలు ఎవరూ ఈ వేడుకలో పాల్గొనరని చెప్పారు. గతేడాది గంగాహారతిలో అదానీ కుటుంబం పాల్గొంది. ఆ సమయంలోనే గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో ఎలాగైతే పెళ్లి జరుగుతుందో అదే విధంగా జీత్, దివాల వివాహం ఉంటుందన్నారు. సంప్రదాయబద్ధంగా, కుటుంబసభ్యుల మధ్యే పెళ్లి వేడుక ఉంటుందని తెలిపారు.

సంప్రదాయం, కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చేలా వారి వివాహం ఉండనుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.. ప్రముఖ దివ్యాంగుల ఎన్జీఓతో చేతులు కలిపి జీత్, దివాల వివాహానికి షావల్స్ తయారు చేయనున్నారు. అంతేకాక ఈ ఎన్ జి ఓ నే వివాహ విందులో వాడే ప్లేట్లు, గ్లాసులకు పెయింట్స్ కూడా వేస్తోంది. ఈ ఐడియా జీత్ అదానీదే.. ఆయనెప్పుడూ దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూఉంటారు.