మిస్సెస్ పై పెరుగుతున్న విమర్శలు

మిస్సెస్ పై పెరుగుతున్న విమర్శలు

సన్యా మల్హోత్రా నటించిన చిత్రం ‘మిస్సెస్’.జి 5 లో విడుదలైన ఈ మూవీ పైన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఒక పురుష హక్కుల సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. మూవీ మితిమీరిన స్త్రీ వాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఒక మహిళ తన ఇంట్లో పనులు చక్కబెట్టి,కుటుంబసభ్యుల అవసరాల తీరిస్తే అదెలా అణచివేత అవుతుందని ప్రశ్నించింది . వంట చేయడం లో ఒత్తిడి ఎం ఉంటుందని .అదొక రకమైన ప్రశాంతతను అందిస్తుందని తెలిపింది.కుటుంబం కోసం పురుషులు ఎంతో శ్రమిస్తుంటారని , పని ప్రదేశాల్లో ఒత్తిడి కి లోనవుతారని పేర్కొంది.ఈ పోస్ట్ పై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజాన్ని జీర్ణించుకోండి ‘ అని కామెంట్స్ పెడుతున్నారు. “ఇంటి పనులు చేస్తూనే మహిళల వృత్తి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. బయట ఎన్ని పనులు చేసిన ఇంటికి వచ్చాక కుటుంబసభ్యుల అవసరాలు తీరుస్తున్నారు. పురుషులు అలా కాదు. ఇంటి పనుల్లో సహాయం చేయరు కానీ ,ఇష్టమైన ఫుడ్ కోసం డిమాండ్ చేస్తారు”. అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.2021లో విడుదలైన మలయాళీ మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ‘కు రీమేక్ గా ‘మిస్సెస్’ మూవీ తెరక్కెకింది. పెళ్లి తర్వాత కొంతమంది అమ్మాయిలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇందులో చూపించారు. ఆరతి కడవ్ ద్దెనికి దర్శకత్వం వహించారు.

psl0viJpKfYcWDeasHQb5UBFKzQ

సమాజంలో ఇంటి పనుల విలువ

ఈ వివాదం నేటి సమాజంలో ఇంటి పనుల విలువ, కుటుంబంలో మహిళల పాత్ర గురించి మరింత చర్చకు దారి తీసింది. పురుష హక్కుల సంఘాలు మరో వైపు, కుటుంబ పోషణలో పురుషులు పడే ఒత్తిడిని పట్టించుకోవాలని వాదిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం పురుషులను కించపరిచేవిధంగా మారకూడదనే వాదన వినిపిస్తోంది.

ప్రశంసలు

‘మిస్సెస్’ చిత్రం 2023లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్లో ప్రదర్శించబడింది. అక్కడ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. గృహిణిగా బాధపడుతున్న పాత్రను సన్యా మల్హోత్రా జీవించిపోయిందని, ఆమె నటన గొప్ప గా నిలిచిందని సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వచ్చాయి.’మిస్సెస్’ సినిమా ఎవరికి ఏ విధంగా అనిపించినా, అది కుటుంబ వ్యవస్థలో మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న అంశాలపై విస్తృత చర్చను తెరమీదకు తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఇంటి పనులను లైట్ తీసుకోవడం, లేదా మహిళల బాధను తప్పుగా అర్థం చేసుకోవడం కాకుండా, కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాధ్యతలను సమానంగా పంచుకోవాలనే సందేశం అందరికీ అవసరం.

Related Posts
కాన్సర్ట్ కోసం రాజమౌళి నిరీక్షణ
రాజమౌళి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నా టూర్‌ ఎమ్ఎమ్‌కే’ లైవ్ కాన్సర్ట్

ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎమ్ కీరవాణి తన సంగీత ప్రయాణంలో మరో గొప్ప అధ్యాయం ప్రారంభించబోతున్నారు. నా టూర్‌ ఎమ్ఎమ్‌కే పేరుతో ఆయన Read more

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోను సెట్ చేసిన నాని?
nani  chiranjeevi

ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి నటించే తదుపరి చిత్రం గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు వెలువడింది. Read more

Hari Hara Veera Mallu: మీసం తిప్పిన పవన్ కళ్యాణ్..
Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన లేటెస్ట్ ప్రాజెక్టులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, వీటిలో హరిహరవీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ Read more

విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్
విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్

ఇటీవల మదగజరాజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో ఆయన శరీర భాష అభిమానులను షాక్‌కు గురి చేసింది. వేదికపైకి నడవడానికి సహాయం తీసుకోవడం, మాట్లాడే Read more