హ్యాకింగ్

Hacker బాధ: హ్యాకింగ్ బాధితుల మనోవేదన

ఫోన్ హ్యాకింగ్ బాధ తట్టుకోలేక ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉట్ల దత్తాత్రేయ కులవృత్తి మంగలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉట్ల భువనేశ్వరి (35) కు స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే ఆమె స్మార్ట్ ఫోన్ గత కొన్ని సంవత్సరాల క్రితం హ్యాకింగ్ చేయబడింది. హ్యాకర్లు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులు సాగించారు.

Advertisements

హ్యాకర్ల బ్లాక్ మెయిల్

హ్యాకర్లు ఆమె చిత్రాలను మార్పింగ్ చేసి ఆమె ఫోన్‌కు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. భువనేశ్వరి భర్త దత్తాత్రేయ ఇరుగు పొరుగు వద్ద డబ్బులు అప్పుగా తెచ్చి హ్యాకర్లకు సమర్పించినప్పటికీ, వారు తగ్గలేదు. మరింత డబ్బు ఇవ్వాలని బెదిరింపులు చేశారు.

గ్రామస్థులకు షాక్

హ్యాకర్లు తెగింపు చర్యలు తీసుకుని భువనేశ్వరి మార్ఫింగ్ చేసిన ఫోటోలను కొంతమంది గ్రామస్థులకు పంపించడంతో, ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. గ్రామస్థుల సూచనతో పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, హ్యాకర్ల బెదిరింపులు తగ్గలేదు.

ఒత్తిడికి గురైన బాధితురాలు

ఒత్తిడి కారణంగా భువనేశ్వరి అనారోగ్యానికి గురయ్యింది. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గమనించిన స్థానికులు భర్త దత్తాత్రేయకు సమాచారం అందించడంతో, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
ap pensions

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం Read more

బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం!
babu and bill gates

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ Read more

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
kodalinani

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , Read more

Purandeshwari: వక్ఫ్ బోర్డును మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాము: పురందేశ్వరి
వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాధాన్యం కల్పించాం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల వక్ఫ్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రకటనలలో, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×