game changer

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఆరోజే.

విజయవాడలో ఆదివారం జరిగిన భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా పై ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను వెల్లడించారు.ఈ ఈవెంట్‌లో,రామ్ చరణ్ యొక్క భారీ కటౌట్‌ను ఆవిష్కరించి,ట్రైలర్ విడుదల తేదీ, మెగా ఈవెంట్ పై కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించగా,కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.

ఈ సినిమాలో అంజలి,శ్రీకాంత్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,జీ స్టూడియోస్,దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.జనవరి 10న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ క్రమంలో, విజయవాడలో RC యువశక్తి ఆధ్వర్యంలో రామ్ చరణ్ యొక్క 256 అడుగుల ఎత్తున ఉన్న భారీ కటౌట్‌ను ఆవిష్కరించిన ఈవెంట్‌ను దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, దిల్ రాజు మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ ట్రైలర్ నాకు ఇప్పటికే ఉంది. కానీ మీరు చూసే సమయం రాకముందు మాకు ఇంకా చాలా పని చేయాలి.

game changer
game changer

అందుకే, ఈ ట్రైలర్‌ను కొత్త సంవత్సరానికి స్వాగతంగా జనవరి 1న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.విజయవాడ అంటే నాకు చాలా స్పెషల్. ఇక్కడ రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవిగారి మీద మీ అభిమానం 40, 50 సంవత్సరాలుగా ఉంది. ఆయన నుండి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా ఎంతో మంది మెగా హీరోలు వచ్చినారు.అలాగే, అమీర్కాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆయన డేట్ ఇచ్చిన వెంటనే ఈవెంట్ తేదీ, స్థలం కట్టుబడి తేల్చుకుంటాం.

Related Posts
ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు.
ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు

కీర్తి సురేష్, దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి, ఆ వెంటనే మహానటి చిత్రంతో భారీ Read more

Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే
Ayesha Kaduskar 17 s1asSm1622

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఈ Read more

Tollywood:నెట్టింట హాట్ ఫోటోలతో బ్యూటీ రచ్చ..
ketika sharma

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మడికి పైన పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా, ఇప్పటివరకు ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. Read more

‘థగ్ లైఫ్’ ఈ తేదీన విడుదల కానుందా
Thug Life

సమస్త తెలుగు చిత్రపరిశ్రమలో మణిరత్నం మరియు కమల్ హాసన్ కలయికకు ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆఖరి చిత్రమైన 'నాయకన్' తర్వాత, ఈ జంట మళ్లీ చలనచిత్ర Read more