గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వు—ఇలాంటి లుక్‌తో ఆ అమ్మాయి మహాకుంభమేళాను ఆకట్టుకుంది. ఆమె అందంతో మంత్రముగ్దమైన ప్రజలు, ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా? ఆమె పేరు మోనాలిసా.ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముతున్న మోనాలిసా, తన అందంతో ఈవెంటులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అందరికీ చేరాయి.

మోనాలిసా మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ దండలు అమ్ముతోంది.కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆమె అందం చూసి చాలామంది ఫిదా అయిపోయారు.మోనాలిసా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం తెలుస్తోంది.
డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను త్వరలోనే కలవబోతున్నారని, “మోనాలిసా తన రూపం, అమాయకత్వం చూసి నాకు చాలా ఇష్టం,” అని తెలిపారు.”డైరీ ఆఫ్ మణిపూర్” సినిమాలో ఆమెను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో మోనాలిసా రైతు కూతురి పాత్ర పోషించబోతుంది. ఈ పాత్ర కోసం ఆమె చాలా అనుకూలంగా ఉంటుందని డైరెక్టర్ సనోజ్ మిశ్రా చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే, మోనాలిసా యాక్టింగ్ నేర్చుకోవడానికి సనోజ్ మిశ్రా ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లిపోతారని చెప్పారట.ఇంతకీ, ఈ అమ్మాయి అంతరంగంలో మారిపోయింది. సునాయనగా ఉండే ఈ అమ్మాయి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన కళ్లతో ఈ రంగంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది.