ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్..ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాదు..పక్కాగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుతుంది. ముఖ్యంగా గత నెల ఒకటో తారీఖునే ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంచిన పెన్షన్ తో ఇంటివద్దకు వెళ్లి పెన్షన్ అందజేసిన సర్కార్..ఆగస్టు నెలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అది కూడా నాల్గు రోజుల ముందే.

గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు ఒకటినాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. అలాగే మొదటి రెండు రోజులు పింఛన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో సోషల్ మీడియా, మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డిగ్ ప్లే చేయడం, వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని.. ఈ సమాచారం ప్రతి పింఛన్ లబ్ధిదారుడికి చేరాలని సూచించారు.