‘OG’ సెట్లో తమన్ సందడి

thaman og set

పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో ‘OG’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ , టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసాడు డైరెక్టర్ సుజిత్. దీంతో సినిమాను ఇంకెంతలా తెరకెక్కిస్తున్నాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో షూటింగ్ కు ఆలస్యం అవుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సెట్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి సందడి చేసాడు. సెట్లో డైరెక్టర్ సుజీత్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, DOP రవి కే చంద్రన్ డిస్కస్ చేస్తోన్న ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే పవన్ సినిమా సెట్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ ని RRR ఫేమ్ దానయ్య నిర్మిస్తుండగా..ప్రియాంక మోహన్ , శ్రీయారెడ్డి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. To help you to predict better. 禁!.