TGS RTC MD Sajjanar clarity on bus ticket charges hike

బస్సు ఛార్జీలు పెంపుపై టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ

హైదరాబాద్: బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించినట్లు చెప్పారు. అంతేకానీ రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతుంది. రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు తిప్పుతుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది.

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం మేర ర‌ద్దీ పెరిగింది. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణ‌మి, త‌దిత‌ర పండుగ‌ల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణాలు పెరిగాయి. ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా పండుగుల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల‌కు చార్జీల‌ను జీవో ప్ర‌కారం స‌వ‌రించ‌డం జరుగుతోంది.

టీజీఎస్ఆర్టీసీలో ప్ర‌స్తుతం 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయి. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతుంది. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల సవరణ ఉంటుంది. మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దు.

పండుగ స‌మ‌యాల్లో రెగ్యుల‌ర్ , స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌ల్లో తేడాలుండటం సాధారణం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ప్ర‌యాణికుడు వెళ్లేట‌ప్పుడు రెగ్యుల‌ర్ స‌ర్వీసుల్లో ప్రయాణిస్తే సాధార‌ణ టికెట్ ధ‌ర‌నే ఉంటుంది. తిరుగుప్ర‌యాణంలో స్పెష‌ల్ బ‌స్సును వినియోగించుకుంటే జీవో ప్ర‌కారం సవరణ చార్జీలుంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేయడం జరుగుతుంది. పండ‌గ స‌మ‌యాల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం మరోసారి స్ప‌ష్టం చేస్తుంది. సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయి. స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది.

Related Posts
పుష్ప 2 – కిస్సిక్ సాంగ్ రికార్డ్స్ బ్రేక్
kissik song views

పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన 'కిస్సిక్' సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా Read more

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..
Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు.. శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు Read more

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన
revanth reddy

తెలంగాణకు విదేశీ పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, Read more

స్విమ్మింగ్ పూల్లో లో స్నానం చేసి హీరోకు షాక్ ఇచ్చిన ఆగంతకుడు
స్విమ్మింగ్ పూల్లో లో స్నానం చేసి హీరోకు షాక్ ఇచ్చిన ఆగంతకుడు

ఈ విధమైన ఘటనలు కొత్తవి కాదు. బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రైవేట్ గదులలో సురక్షితంగా ఉండడం కోసం కట్టుదిట్టమైన భద్రత తీసుకున్నా, ఇప్పటికీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *