జానీ మాస్టర్ పై వేటు వేసిన ఫిలిం ఛాంబర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసింది. జానీ మాస్టర్ షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో బలవంతం చేశాడని.. తన కోరిక తీర్చాలని నన్ను ఎంతో వేధించాడని.. తన కోరిక తీర్చకపోతే.. ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని.. తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ పై కేసు ఫైల్ చేసారు.

ఈ క్రమంలో జానీ మాస్టర్ కు ఫిలిం ఛాంబర్ షాక్ ఇచ్చింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు గాలిస్తున్నారు.