📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Police Complaint Authority: రాష్ట్ర పోలీస్ కంప్లయింట్ అథారిటీ ప్రారంభం

Author Icon By Sharanya
Updated: August 4, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ఎట్టకేలకు పోలీసు కంప్లయింట్ అథారిటీ (Police Complaint Authority) ఏర్పాటయింది. బిఆర్కె భవన్లో ఇంతకు ముందు కాళేశ్వరం (Kaleswaram) కమిటీ కార్యాలయం వున్న ఛాంబర్లో ఏర్పాటయిన పోలీసు కంప్లయింట్ అథారిటీని చైర్మన్ గా నియమితులైన విశ్రాంత జడ్జి జస్టిస్ శివశంకర్రావు ప్రారంభించారు.

ఫిర్యాదులను స్వతంత్రంగా విచారిస్తుందని

డిఎస్పి అంతకు పైస్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదులను ఈ విభాగం స్వతంత్రంగా విచారిస్తుందని ఈ సందర్భంగా జస్టిస్ శివశంకర్రావు (Justice Sivashankar Rao) తెలిపారు. పోలీసు కంప్లయింట్ అథారిటీ (Police Complaint Authority) ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను తమ సంస్థ నిస్పక్షపాతంగా విచారించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు కంప్లయింట్ అథారిటి ఎంతో కీలకమైనదని ఆయన వెల్లడించారు. ఇటువంటి విభాగాల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై, ప్రజా స్వామ్యంపై మరింత నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు. పోలీసు అధికారులు తప్పిదాలకు, అక్రమాలకు పాల్పడితే ప్రజలు ధైర్యంగా ముం దుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా వుంచుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసు కంప్ల యింట్ అథారిటిలో సభ్యులుగా వున్న విశ్రాంత ఐజి ప్రమోద్ కుమార్, విశ్రాంత జిల్లా జడ్జి వర్నే వెంకటేశ్వర్లు, వై. అరవింద్రెడ్డి, రాంనరసింహా రెడ్డి, రాజేందర్, శాంతిభద్రతల ఎఐజి రమణకుమార్ కూడా పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rbi-rs-5-thousand-crore-loan-government-indent-to-reserve-bank/telangana/525470/

Breaking News latest news police accountability Police Complaint Authority Telangana Telangana law and order reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.