వరద బాధితులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం తెలంగాణ లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వేలాది ఎకరాలు నీటిమట్టం కావడమే కాదు..వరదలతో పలువురు ప్రాణాలు విడిచారు.

ఎన్నో ఇల్లులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని, ఉదారంగా సాయం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం 5.17,500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.