Telangana Lawset, PG L Set schedule released

తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే.. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

. టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్:
. నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025.
. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025.
. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
. ఆలస్య రుసుముతో మే 25, 2025
. పరీక్ష తేదీ జూన్ 6, 2025

image

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు. అర్హత- మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం చేయాలనుకునే వారు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి.

Related Posts
CM Revanth Reddy: నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు
Today they will receive compassionate employment letters.

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలో కారుణ్య నియామకాలు చేపడతారు. మొత్తం 582 మంది Read more

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే : హరీశ్ రావు
Government is fully responsible for this incident: Harish Rao

కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపాటు హైదరాబాద్‌: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక Read more

కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఉరట
High Court orders not to arrest KTR for ten days

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more