revanth reddy

దావోస్‌లో తెలంగాణ కీలక ఒప్పందం

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారి మధ్య ఎంవోయూ కుదిరింది. కాగా దావోస్‌లో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం బోణీ కొట్టింది. దీంతో వచ్చే నెలలో హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో చర్చలు జరిపారు. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, ఆర్ట్‌ఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌‌లను అందిస్తుంది. . ఇక తెలంగాణలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు.

Advertisements

విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో రెండు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనీ లీవర్‌ కంపెనీ తెలిపింది. తెలంగాణలో పామాయిల్‌ ఫ్యాక్టరీ, రిఫైనింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని; సీసా మూతలు ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్‌ పెడతామని ప్రకటించింది. రాష్ట్రంలోనే సీసా మూతలను ఉత్పత్తి చేస్తే దిగుమతి అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన యూనీ లీవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందించారు.

Related Posts
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం రేషన్ కార్డు ఒకటి చాలు – బీసీ కార్పొరేషన్ ఎండీ
rajeev

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేయాలంటే కేవలం రేషన్ కార్డు ఉండటం చాలిపోతుందని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి Read more

Swimming: ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం
ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం

ఈత అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి, సరదా అయితే ఈత వచ్చిన వారు, నేర్చుకునే వారు ప్రమాదాలు, వ్యాధులకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా Read more

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో- న్యాయవాది మృతి
Lawyer dies of heart attack in Telangana High Court

ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్ హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి Read more

లిక్కర్ ధరల పెంపు ఎప్పుడంటే?
liquor

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ఆదాయంతోనే ప్రభుత్వాలు తమ మనుగడకు సాగించేలా వున్నాయి. తాజాగా తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. Read more

×