BRS MLC kavitha

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత, ప్రభుత్వ హామీల అమలు అంశాల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ఆమె విమర్శించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సొంత లాభాల కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణ పరిస్థితుల్లో ఉంది. ప్రతి మూడు గంటలకోసారి లైంగిక దాడి జరుగుతుండటం బాధాకరం” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్టపాలనతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రగతిశీల తెలంగాణ కోసం కేసీఆర్ శ్రమించి సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు నాశనం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా, వారి నమ్మకాలను ద్రోహం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించిన కవిత, “కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ తీరుపై ప్రశ్నించాలని, వారికి బదులు చెప్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. కాంగ్రెస్ హామీలను గాలికొదిలేసి, ప్రజల నమ్మకాన్ని వంచిస్తున్నారు. ప్రజలు తక్షణమే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి అని ఆమె పేర్కొన్నారు.

Related Posts
సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత
Bank of Baroda presented donation cheque with CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటిని విరాళంగా అందించింది. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ Read more

భారతదేశం చేసిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష: చరిత్రాత్మక విజయం
hypersonic missile

భారతదేశం తొలి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా కీలకమైన అడుగుగా నిలిచింది. ప్రభుత్వ Read more

మహాకుంభ మేళలో భారీ అగ్నిప్రమాదం
మహాకుంభ మేళలో భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 45 రోజుల పాటు జరుగుతున్న మహాకుంభ మేళాలో ఈ చేదు సంఘటన సెక్టార్ 19లో ఉన్న Read more

శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం
శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం

హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా అనుకోని సమస్యను ఎదుర్కొంది. ఈ కారణంగా విమానంలో 144 మంది Read more